వినాయకుడికే నిమజ్జనమెందుకు ?

సాధారణంగా మనం శ్రీరామ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, వినాయక నవరాత్రులు, శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవ నవరాత్రులు చేస్తాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే గంగమ్మలో నిమజ్జనం చేస్తాం. ఎందుకు.. పరిశీలిస్తే…

Why do Hindus celebrate Ganpati Visarjan
Why do Hindus celebrate Ganpati Visarjan

భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే.

దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న సత్యాన్ని గ్రహించడానికి. అంతేకాదు తన తల్లి గంగమ్మ దగ్గరకు ఆయను పంపిస్తారని లోకోక్తి. ఏ వస్తువైనా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవడం సహజమనే సత్యాన్ని తెలియజేస్తుంది వినాయక నిమజ్జనం.

– కేశవ