నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు..!

-

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకులున్నాయి. వీటిల్లో ప్రభుత్వానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని వేగవంతం చేయాలంటూ ఇటీవలే ఆర్థిక శాఖకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.

banks
banks

ఫలితంగా ఆర్థిక శాఖ వర్గాలు ప్రైవేటీకరణ సంప్రదింపుల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అదే జరిగితే కేవలం 5 పెద్ద బ్యాంకులే ప్రభుత్వ బ్యాంకులుగా ఉంటాయి. ఇటీవల కాలంలో రెండు దఫాలుగా చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియకు వెలుపల ఉండిపోయిన నాలుగు బ్యాంకులనే ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మనదేశంలో బ్యాంకులను జాతీయం చేయడం (ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా మార్చటం…) 1969లో ఒకసారి, 1980లో రెండోసారి జరిగింది. అప్పటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. కానీ గత అర్ధశతాబ్దిలో ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు వచ్చాయి. రుణ వితరణ తీరుతెన్నులు, బ్యాంకింగ్‌ సేవల్లో కొత్తదనం చోటుచేసుకుంది. పోటీ అనూహ్యంగా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news