భక్తి: సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఇలా పూజ చెయ్యాలి..!

మంగళవారం నాడు హనుమంతుడికి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించి ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆ రోజు ఆంజనేయ స్వామిని పూజించి, ఉపవాసం ఉండే దంపతులకు సంతానం త్వరగా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.

lord-hanuman
lord-hanuman

అలానే రాత్రి ఉప్పులేని అన్నం కూడా చాలా మంది తింటారు. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సింధూరంతో పూజలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అదే విధంగా మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. ఎరుపు రంగు తో చేసిన కేసరి లేదా ఏదైనా స్వీట్ నైవేద్యం కింద సమర్పించడం వల్ల హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది.

ఈ విధంగా దంపతులు మంగళవారం నాడు పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సకలపాప దోషాలు నుండి విముక్తి కలుగుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. హనుమంతుడిని తమలపాకులతో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. తమలపాకులతో అభిషేకం చేయడం ద్వారా సుఖ శాంతులు కలుగుతాయి. ఇదిలా ఉంటే హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది. ఇలా సంతాన ప్రాప్తి కలగాలంటే దంపతులు ఈ విధంగా మంగళవారం నాడు అనుసరిస్తే మంచిది .