పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి !

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అక్టోబర్ 16 శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహన సేవ జరిగింది.శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి అలంకారంలో అనుగ్రహించారు.

శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.

– శ్రీ