సాయిబాబా దేవాలయంలో అన్నదానం చేస్తే ఈరాశికి శుభ ఫలితాలు! మార్చి 21 రాశిఫలాలు

-

మార్చి 21 గురువారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి : చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో నష్టాలు, అనవసర శతృత్వాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: సాయిబాబా దేవాలయంలో ప్రదక్షిణలు, ధునిలో కొబ్బరికాయను వేయండి చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది.

వృషభరాశి : అన్నింటా విజయం, కార్యజయం, లాభం,వస్తులాభం, విందులు.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు, పసుపు రంగు దుస్తులు లేదా ఖర్చీపుతో బయటకు వెళ్లండి మంచిది.

March 21st thursday Daily Horoscope

మిథునరాశి : వ్యతిరేక ఫలితాలు, అనవసర వివాదాలు, వ్యసనాల వల్ల ఖర్చులు, నష్టం.
పరిహారాలు: గురు గ్రహానికి ప్రదక్షణలు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి.

కర్కాటకరాశి : అనుకూలమైన రోజు, బాకీలు తీరుస్తారు, ప్రయాణ సూచన, అలసట,పనులు పూర్తి.
పరిహారాలు: సాయిబాబా/దత్తాత్రేయ దేవాలయం సందర్శించి ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి : అనుకున్నవి జరుగుతాయి, విందులు, విహారయాత్రలు, అధిక ఖర్చులు, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ మంచి చేస్తుంది.

కన్యారాశి : అనుకూలం. కొత్త కార్యాలకు అనుకూలం, రాజకీయ పరిచయాలు, పనులు పూర్తి, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: గురు గ్రహ స్తోత్రపారాయణం/శ్రవణం చేయండి.

తులారాశి : మంచి, చెడుల మిశ్రమం. ఆర్థిక పనుల్లో ఇబ్బందులు, కొత్త వ్యక్తుల కలయిక, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: పసుపు రంగు పూలతో సాయిబాబా పూజ/దేవాయల దర్శనం మంచి చేస్తుంది.

వృశ్చికరాశి : అన్నింటా అనుకూలం, లాభం, సంతోషం, పనులు పూర్తి, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు, సాయిబాబా దేవాలయంలో అన్నదానం చేయండి మంచిది.

ధనస్సురాశి : విందులు, వినోదాలు, స్నేహితల వల్ల లాభం, అధిక ధనవ్యయం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదవారికి వస్త్రదానం చేయండి.

మకరరాశి : మిశ్రమ ఫలితాలు, అపనిందలు, విరోధాలు, కార్యజయం,కుటుంబ సంతోషం.
పరిహారాలు: గురు గ్రహానికి పూజ/ పేదలకు అన్నదానం చేయండి మంచి జరుగుతుంది.

కుంభరాశి : ప్రతికూలమైన ఫలితాలు, అనవసర విరోధాలు, తండ్రి సంబంధీకులతో నష్ట సూచనలు.
పరిహారాలు: వివాదాలకు దూరంగా ఉండండి. వేంకటేశ్వరస్వామికి పిండితో చేసిన దీపారాధన, అనంతరం దాన్ని గోవుకు తినిపించండి.

మీనరాశి : అనుకూలం. బంధువుల కలయిక, లాభం, కుటుంబంలో సఖ్యత, పనులు పూర్తి.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణ, పసుపు పూల మాల సమర్పణ మంచి చేస్తుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version