AP Elections 2019: జనసేన కింగ్ మేకర్ అవ‌నుందా?

-

పవన్ కల్యాణ్ కూడా ఎక్కువగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రపైనే ఫోకస్ పెట్టడం.. దానిలో భాగంగా గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయడం… మరోవైపు పవన్ అన్న నాగబాబు ఇవాళే పార్టీలో చేరి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం చూస్తుంటే

ఏపీ ఎన్నికల్లో ఇన్ని రోజులు ద్విముఖ పోరే అని అనుకున్నారు అంతా. ప్రధాన పోటీ కేవలం టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే అనుకున్నారు అంతా. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఉన్నప్పటికీ.. అది ఏం చేస్తుందిలే.. నిన్న మొన్న వచ్చిన పార్టీ అని అంతా అనుకున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. బీఎస్పీ పార్టీకి 21 సీట్లు కేటాయించారు పవన్. వామపక్షాలకు 14 స్థానాలు కేటాయించారు. మిగితా స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అయితే.. ఒక్క జనసేన మాత్రమే కాకుండా.. మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగుతుండటంతో ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ప్రధాన పార్టీలకు టెన్షన్ స్టార్ట్ అయిందట. దీంతో ఏపీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కల్యాణ్‌కు మద్దతు పలుకుతోంది. కోస్తా ప్రాంతంలో బలంగా ఉండేది కాపు వర్గం ప్రజలే. అందుకే కాపు ప్రజలను తన వైపుకు మలుచుకోవడానికి చంద్రబాబు వంగవీటి రాధాను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. అందుకే రాధాకు చంద్రబాబు టికెట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ.. కాపులు పవన్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది.


దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో కాపుల జనాభా అధికంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను నిర్ణయించే హక్కు వాళ్లకే ఉంది. అంతే కాదు.. యూత్‌లోనూ పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ కూడా ఎక్కువగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రపైనే ఫోకస్ పెట్టడం.. దానిలో భాగంగా గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయడం… మరోవైపు పవన్ అన్న నాగబాబు ఇవాళే పార్టీలో చేరి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం చూస్తుంటే జనసేన గట్టిగానే జనాల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version