ప్రపంచంలో అతిపురాతన దుర్గాదేవి ఆలయం ఎక్కడుందో తెలుసా..?

1571

ప్రపచంలో అత్యంత పురాతన ధర్మం సనాతన ధర్మం. అలాంటి దీన్ని ప్రస్తుతం హిందూ మతంగా వ్యవహరిస్తున్నారు. అనేకమంది దేవుళ్లు.. వారికి ఎన్నో ప్రత్యేక ఆలయాలు. అత్యంత పురాతన ఆలయాలు కోకల్లలు. వాటిలో ప్రధానమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు.

mundeshwari devi temple in bihar 1000 years oldest temple india
mundeshwari devi temple in bihar 1000 years oldest temple india

ఏడో శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడినాయి. ఈ దేవాలయం వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతన లయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం .ఇది కైమూర్ జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో వుంది. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది.

mundeshwari devi temple in bihar 1000 years oldest temple
mundeshwari devi temple in bihar 1000 years oldest temple

ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం.ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దీనిని 105ఏడి లో నిర్మించివుంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది.

పదిచేతులతో అమ్మవారు

1000 years oldest temple india
1000 years oldest temple india

ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో వుంటాడు. రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగివుంటాయి. ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ ఈ ఆలయాన్ని సందర్శించటానికి చైత్రమాసంలో అధికసంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు. పురావస్తుశాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కొలకత్తా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. ఇక్కడ అమ్మవారిని శక్తిరూపంలో అంతే కాకుండా ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా భావిస్తారు.

సాత్విక బలి

Mundeshwari devi temple in bihar
Mundeshwari devi temple in bihar

ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అటు పై పూజారి మంత్రించిన అక్షింతలను మేక పై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు సృహతప్పి పడిపోతుంది. అటు పై మరోసారి పూజారి అక్షింతలను మేక పై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Mundeshwari devi temple
Mundeshwari devi temple

– కేశవ