హనుమాన్ చాలీసా పారాయణం ఈరాశికి శుభాన్నిస్తుంది! మార్చి 9 రాశి ఫలాలు

-

హనుమాన్ చాలీసా పారాయణం ఈరాశికి శుభాన్నిస్తుంది!

march 9, 2019 Saturday today horoscope

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, పిల్లల వల్ల పేరు, బంధువులతో మంచి జరుగుట, భార్యకు అనారోగ్యం.
పరిహారాలు: దగ్గర్లోని దేవాలయ ప్రదక్షణలు, చాలీసా పారాయణం.

వృషభరాశి: అనుకూలం. సంతోషం, ధనలాభం, పనులు పూర్తి,అధికవ్యయం, బాకీలు తీరుస్తారు.
పరిహారాలు: గోవింద నామాలు చదువుకోండి. వీలైతే గోసేవ చేయండి.

మిథునరాశి: మిశ్రమం. ఆదాయానికి మించిన ఖర్చులు, చిన్నచిన్న సమస్యలు, వస్తులాభం.
పరిహారాలు: గోసేవ/పేదవారికి అన్నదానం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి: ప్రతికూలమైన రోజు, కార్యనష్టం, వస్తునష్టం, వస్త్రనష్టం.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం/ దేవాయల ప్రదక్షణలు మంచి చేస్తాయి.

సింహరాశి: మిశ్రమం. స్త్రీమూలక ధనలాభం, బంధువులతో విరోధాలు, నష్టాలు.
పరిహారాలు: చాలీసా పారాయణం, వివాదాలకు దూరంగా ఉండటం మంచి చేస్తుంది.

కన్యారాశి: ప్రతికూలం. ధననష్టం, వస్తునష్టం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: చాలీసా పారాయణం/నవగ్రహ ప్రదక్షణలు మంచిచేస్తాయి.

తులారాశి: అనుకూల ఫలితాలు, కార్యలాభం, వస్తులాభం, ధనప్రాప్తి. పనుల్లో పురోగతి.
పరిహారాలు: ఏదైనా మంచి పనిచేయండి ఇతరులకు సహాయ పడండి.

వృశ్చికరాశి: ప్రతికూల ఫలితాలు, ఆందోళన, భయం, నష్టం.
పరిహారాలు: చాలీసాను కనీసం మూడుసార్లు పారాయణం చేయండి. సింధూర ధారణ మంచి చేస్తుంది. చెడు ఫలితాల తీవ్రతను తగ్గిస్తుంది.

ధనస్సురాశి: మంచి రోజు. లాభం, వస్తులాభం, చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు/గోసేవ మంచి చేస్తుంది.

మకరరాశి: మంచి ఫలితాలు. లాభం, కార్యజయం, వ్యాపారులకు లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ చేసుకోండి మంచిది.

కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, కార్యసిద్ధి, ధనవ్యయం, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: గోసేవ, ఇష్టదేవతరాధన చేయండి మేలు జరుగుతుంది.

మీనరాశి: అనుకూలం. ధనలాభం, బాకీలు వసూలు, కొత్త వ్యక్తుల పరిచయం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ, సింధూర ధారణ మంచిది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news