అందుకే ఇండియా ని విడిచిపెట్టేస్తాం.. వాట్సాప్ షాకింగ్ డెసిషన్..!

-

అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాల్సి వస్తే కనుక మేము భారత్ ని విడిచి పెట్టాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు కి వాట్సాప్ సంస్థ చెప్పింది. 2021 లో వచ్చిన కొత్త ఐటీ నిబంధనలో సెక్షన్ 4 (2) కి సవాల్ చేస్తూ వాట్సాప్ ఫేస్బుక్ సంస్థలు చేసిన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు విచారణని జరిపింది. అయితే ఈ విచారణలో సంస్థలు తరపు న్యాయవాది ఆన్లైన్ ప్లాట్ఫారంలో సందేశాల భద్రత కోసం అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు అయితే ఈ విధానంపై గోప్యత హామీ ఉండడంతో కోట్లాదిమంది భారతీయులు వినియోగిస్తున్నారని అన్నారు.

అయితే ఈ సెక్షన్ వలన మేం బలవంతంగా ఎన్క్రిప్షన్ ని బ్రేక్ చేయాల్సి ఉంటుందని అలా చేయకపోతే మీరు చెప్పేది మేము మా సేవల్ని భారత్ లో నిలిపివేయాల్సి వస్తుందని కోర్టుకి
వాట్సాప్ వివరించింది. ఈ సెక్షన్ వ్యక్తుల గోప్యత కి వ్యతిరేకం అని రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన న్యాయవాది కోట్లాదిమంది సంభాషణల్ని కొన్నాళ్లపాటు భద్రపరచాల్సి ఉంటుందని, ఇటువంటి నిబంధనలు ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news