వివాహం కావాలంటే వెంటనే ఇలా చేయండి !

-

జీవితంలో ప్రధానఘట్టం వివాహం. సరైన వయస్సు వచ్చిందంటే వివాహం అయితేనే మంచిది. అయితే చాలామందికి ప్రధాన సమస్య అన్ని ఉన్నా వివాహం మాత్రం ఆలస్యం అవుతుంది. దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి. జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాల ద్వారా ఇది సంభవిస్తుంది అని జ్యోతిష పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు పండితులు పేర్కొన్న కింది విషయాలను శ్రద్ధతో, విశ్వాసంతో చేస్తే తప్పక వివాహం అవుతుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం…

వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం. ఇలాంటి సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించాలి. సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయాలి. అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించాలి. గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం మంచిది. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

ఇక శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం చేయాలి. రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం. ఇక ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి.
పైన పండితులు చెప్పిన పరిహారాలను పాటిస్తే తప్పక వివాహం త్వరగా అవుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news