శని… నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా దీన్ని భావిస్తారు. ఈ శని గ్రహ అనుకూలత ఉంటే చాలు అన్ని సమస్యలు పోతాయంటారు. అయితే చాలామందికి జీవిత కాలంలో శనిదోషం అంటే ఏలినాటి శని, అర్థాష్టమ శని అంతే కాకుండా గోచారం, జాతకం ప్రకారం శనిదోషాలు ఉంటాయి. వీటిని చూసి భయపడాల్సిన పనిలేదు అని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. శనిదోషం ఉన్న సమయంలో మనస్సు, చేసే పనులు ధర్మ మార్గంలో, సత్యంతో కూడుకుంటే ఆ దశ యోగిస్తుందని అనుభవజ్ఞులు పేర్కొంటున్నారు. శనిదోష పరిహారం కోసం ఖర్చులేకుండా నిత్యం భక్తి శ్రద్ధలతో కింద పేర్కొన్న శ్లోకాలు, మంత్రాలు చదువుకుంటే చాలు అని పండితులు చెప్తున్నారు.
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
ప్రతినిత్యం స్నానం చేసిన తర్వాత…
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శని గ్రహం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ….
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
లేదా నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం!
లేదా
మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో !!
లేదా
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ!!
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే !! అనే శ్లోకాలలో మీకు సులభంగా ఉండే దాన్ని భక్తితో పఠించండి. ముఖ్యంగా శనివారం నాడు ప్రాతఃకాలంలో నవగ్రహాలలో శనికి ప్రదక్షణ చేస్తూ పై శ్లోకాలు చదువుకుంటే తప్పక శనిదోష నివారణ కావడమే కాకుండా అనుకున్న కార్యక్రమాలు సఫలమవుతాయి.
– కేశవ