నవగ్రహ పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా?

-

నవగ్రహ పూజ. ఈ పూజ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే.. చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి?

అయితే.. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి… అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది చెబుతుంటారు. కానీ.. ఇవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే.. ఏ గుడికి వెళ్లేటప్పుడు కానీ.. ముందే కాళ్లు కడుక్కుంటాం. తర్వాత కడుక్కోం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే స్నానం చేసి.. మంచి వస్త్రాలను ధరించి… గుడికి వెళ్తాం.

ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్లాలనుకునప్పుడు.. ముందు నవగ్రహాల పూజ చేసుకొని.. ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకొని.. లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకొని.. ఆ తర్వాత నవగ్రహాల పూజ చేసుకొని ఇంటికి రావాలి. అంతే కానీ.. కాళ్లు కడుక్కోవడం అనేది ఎక్కడా లేదు.

ఇంటి నుంచి గుడి దూరంగా ఉంటే.. కాళ్లకు దుమ్మూదూళి అంటుకుంటే.. అప్పుడు గుడికి వెళ్లేముందు కాళ్లు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ కిందికే వస్తుంది కాబట్టి… పూజ తర్వాత కాళ్లు కడుక్కోకూడదు. అది సరైన పద్ధతి కాదు. పూజ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలి. ఎక్కడికీ వెళ్లొద్దు. ఎవరింటికీ వెళ్లొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version