బంగారం ధర : పెరిగిన పసిడి ధర

-

దేశీ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,200కు చేరింది. పెళ్లిళ్ల సీజన్ సానుకూల ప్రభావం కారణంగా ధరపై ప్రభావం చూపింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.40,100. వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధర అటుఇటుగా ఉండటంతో…సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అందుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు బంగారంపై పాజిటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1,283.40 డాలర్లకు చేరింది. అయితే వెండి ధర మాత్రం ఔన్స్‌కు 15.39 డాలర్లకు తగ్గింది.  ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,200కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.33,050కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version