ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇలా పెంచుకోండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి….!

-

మ‌నం, మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ప్పుడే మ‌న‌కు అన్నింటా అనుకూల ఫ‌లితాలు క‌లుగుతాయి. విద్య‌, ఆరోగ్యం, ఉద్యోగం, ఐశ్వ‌ర్యం.. వంటి అంశాల్లో పాజిటివ్ ఎనర్జీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకనే మ‌నం నివ‌సించే చోట పాజిటివ్ ఎన‌ర్జీ ఉండేలా చూసుకోవాలి. దీంతో అన్ని స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. మ‌రి ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఇంట్లో ప్ర‌ధాన ద్వారం ఎదురుగా మ‌రో ద్వారం లేదా కిటికీ, అద్దం వంటివి ఉండ‌రాదు. ఎందుకంటే మీ ఇంట్లోకి వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ వాటి ద్వారా బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక ప్ర‌ధాన ద్వారం ఎదురుగా అవి ఉండ‌కుండా చూసుకోవాలి.

2. ఉద‌యం సూర్యుడు ఆకాశంలో నుంచి బ‌య‌ట‌కు రాగానే మొద‌ట‌గా భూమిని తాకే సూర్యుని కాంతి ఇంట్లో ప‌డే విధంగా చూసుకోవాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వ‌స్తుంది.

3. ఇంటిని, ఇంటి ప‌రిస‌రాల‌ను ఇంద్ర ధ‌నుస్సులోని రంగుల‌తో చ‌క్క‌గా అలంక‌రించుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌స‌రిస్తుంది.

4. ఇంటిని, ఇంటి ప‌రిస‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త‌, చెదారం ఉండ‌కుండా చూడాలి. అలాగే ఇంటి ప‌రిస‌రాల్లో మురికి నీరు లేకుండా చూసుకోవాలి. దీంతోపాటు ఇంట్లోకి స‌హ‌జ సిద్ధ‌మైన గాలి ప్ర‌సారం ఎక్కువ‌గా ఉండేలా చూసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మై అన్ని స‌మ‌స్య‌లు పోయేలా చేస్తుంది.

5. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని పోగొట్ట‌డంలో ఉప్పు బాగా ప‌నిచేస్తుంది. ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీని ఎక్కువ చేసే శ‌క్తి ఉప్పుకు ఉంటుంది. క‌నుక ఇంట్లో ఈశాన్యం లేదా ఆగ్నేయం దిశలో ఒక గిన్నెలో స‌ముద్ర‌పు ఉప్పు పోసి అలాగే ఉంచాలి. ఇది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని బ‌య‌ట‌కు పంపి, పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతుంది. దీంతో అన్ని స‌మ‌స్య‌ల నుంచి విముక్తి క‌లుగుతుంది.

6. ఇంటి బ‌య‌ట ఆవ‌ర‌ణ‌లో గుడి గంట‌ను లేదా శ‌బ్దం చేసే వ‌స్తువుల‌ను వేలాడ‌దీయాలి. అప్పుడ‌ప్పుడు వాటిని మోగించాలి. లేదా ఇంట్లో ఉదయాన్నే భ‌క్తి పాట‌ల‌ను వినాలి. దీని వ‌ల్ల కూడా ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుకుని స‌మ‌స్యల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు.

7. ఇంట్లో క‌చ్చితంగా దైవం విగ్ర‌హాలు లేదా చిత్ర‌పటాలు ఉంచాలి. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఇరు వైపులా మీ ఇష్ట‌దైవానికి చెందిన చిత్ర‌ప‌టాల‌ను పెట్టుకుని నిత్యం మీరు బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఆ దైవాన్ని ప్రార్థించి వెళితే మీకు అన్ని విధాలా శుభం క‌లుగుతుంది. స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news