వెదురు మొక్కతో పాజిటివ్ ఎనర్జీ వస్తుందట..ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే?

-

ఇంటిరియర్ డెకరెషన్ కోసం ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న మొక్కలను పెంచున్నారు..మరికొందరు వాస్తుప్రకారం..ఇంట్లో కొన్ని మొక్కలను నాటుతున్నారు. ఇంట్లో ఉండే..కొన్నిరకాల ప్లాంట్స్ ద్వారా..పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరికొన్ని వాటి వల్ల నెగిటివి ఎనర్జీ వస్తుంది అని కాదు..కానీ కొన్ని ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ మొక్కల్లో ఒకటి వెదురు మొక్క. ఈరోజు ఇది ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి దోషాలు పోతాయి..ఎంతవరకూ మంచిది అనే విషయం చూద్దాం.

వెదురు పెంపకంతో కోట్లలో ఆదాయం - V.E.R Agro Farms

వాస్తు శాస్త్రంలో వెదురును అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అయితే, ఈ వెదురు మొక్కను సరైన దిశలో నాటితేనే ఇవన్నీ కలుగుతాయి. వాస్తు దోషం ఉన్న ఇళ్లలో వెదురు మొక్కలు నాటితే ఉపశమనం కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వెదురు మొక్క పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంటికి తూర్పు దిక్కులో వెదురు మొక్కను నాటితే సంతోషం, శాంతి, ఆర్థిక శ్రేయస్సు కలిగిస్తుందని పండితులు సూచిస్తున్నారు. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను సృష్టిస్తాయట..మొక్కలతో ప్రేమ ఏంట్రా అని ఆశ్చర్యపోకండి..కొన్ని అంతే..లాజిక్ లేకపోయినా..నమ్మాలి..పెట్టిచూస్తే మీకే అర్థమవుతుందేమో కదా..!

ఇంట్లో మూడు చోట్ల వెదురు మొక్కను నాటడం మంచిది. అయితే, ఆ మొక్కపై సూర్యకాంతి బాగా పడేలా చూసుకోవాలి. అలా అని తీసుకెళ్లి బాగా ఎండపడే ప్లేస్ లో పెడితే..మొక్క దెబ్బతింటుంది. ఇది కుటుంబ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఉదయాన్ని కిటీకి దగ్గర సూర్యకిరణాలు పడతాయి..అక్కడ పెడితే..ఎండ వస్తుంది..కొద్దిసేపటకి కూల్ అవుతుంది.

Bamboo plant: లక్కీ వెదురు మొక్క మీ ఇంట్లో ఉందా? అది ఇలా ఉంటే మాత్రం  దురదృష్టం కలిగిస్తుంది-follow these vastu tips for bamboo plant otherwise  you will face difficulties ,రాశి ...

వెదురు మొక్క ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో 2-3 అడుగుల వరకు పెరిగే వెదురు మొక్కను నాటడం బెటర్. వాస్తు ప్రకారం వెదురును ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా పెంచుకోవచ్చు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కార్యాలయంలో ఎప్పటికప్పుడు వెదురు మొక్కకు నీరు పెట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news