Pitru Paksha 2024 : ఆ 15 రోజులు ఈ ఆహారపదార్దాలను పొరపాటున కూడా స్వీకరించకూడదు..!

-

సెప్టెంబర్ 17న పితృ పక్షం మొదలవుతుంది. 16 రోజుల పాటు ఇది ఉంటుంది. అయితే ఈ సమయంలో పూర్వీకులు భూమి పైకి వస్తారని ఆశీస్సులు ఇస్తారని నమ్ముతారు. కొత్త బట్టలు కొనుగోలు చేయడం మొదలు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వరకు ఈ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. శ్రార్థం పెట్టే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు. మరి ఎటువంటివి చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 15 రోజులు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. చికెన్, గుడ్లు ఇతర ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఉల్లి, వెల్లుల్లి ఉండే ఆహార పదార్థాలకు కూడా ఈ సమయంలో దూరంగా ఉండాలట.

ఆయుర్వేదం ప్రకారం ఉల్లి వెల్లుల్లిలో రజో, తమో గుణాలు ఉంటాయి. ఇవి ఒంట్లో వేడిని ఎక్కువ కలిగిస్తాయి. అలాగే ఆల్కహాల్ ని కూడా తీసుకోకూడదు. మద్యం సేవించే వాళ్ళు ఈ 15 రోజులు మద్యానికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే చెడు ప్రభావం వారి పై పడుతుందట. అలాగే శ్రార్థం పెట్టే వాళ్ళు పచ్చిపప్పులు, గోధుమలు వంటివి ముట్టుకోకూడదు. అలాగే నల్ల ఉప్పు, జీలకర్ర, వంకాయ వంటివి కూడా ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదట.

హిందూమతంలో పితృపక్షాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. కుటుంబంలో మరణించిన సభ్యులకి పితృపక్షంలో వివిధ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. మరణం తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉద్దేశం. అయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ తృప్తి చెందుతే కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి. అందుకని 15 రోజులు కూడా చాలా మంది వివిధ రకాల పుణ్య కార్యక్రమాలను జరుపుతూ ఉంటారు. అందుకని ఈ 15 రోజులు నియమంగా ఉంటే మంచిది. పైన చెప్పిన విధంగా పొరపాట్లు చేయకుండా చనిపోయిన పూర్వీకులను సంతోషంగా ఉంచితే మనం కూడా సంతోషంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news