వాస్తు: ఫోన్స్ లో ఇటువంటి రింగ్ టోన్స్ పెట్టుకోకండి….!

ఈరోజు మన వాస్తు పండితులు కొన్ని విషయాలని మనతో పంచుకోవడం జరిగింది. ఇంట్లో మనకి ఎక్కువగా వినపడే శబ్దాల గురించి వాస్తు పండితులు చెప్పారు. సాధారణంగా ఎక్కువగా ఇళ్ళల్లో మొబైల్ ఫోన్స్, డోర్ బెల్స్, గడియారాలు నుండి శబ్దాలు వినపడుతున్నాయి. అయితే మనం వీటిని ఎక్కువగా పట్టించుకోము.

కానీ వీటి వల్ల చాలా తీవ్ర ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం చూద్దాం….! దీనితో మీకు ఎటువంటి శబ్దాలని పెట్టుకోవచ్చు..?, ఒకవేళ మంచి శబ్దాలని పెట్టుకోకపోతే వాటి వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి..? ఇలా అనేక విషయాలు మనం చూద్దాం.

వాస్తు ప్రకారం ఎటువంటి శబ్దాలు అయితే వినపడతాయో అటువంటి వాతావరణమే ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. సౌండ్ కి కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని గమనించాలి. చాలా మంది ఇళ్లల్లో మొబైల్ ఫోన్ల కి పెద్ద పెద్ద శబ్దాలు, భయంకరమైన శబ్దాలు ఉండేవి పెట్టుకుంటారు.

అవి వాళ్ళు ఇష్టపడచ్చు. కానీ ఇటువంటి శబ్దాల కారణంగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది తద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. కనుక మీరు ఇటువంటి శబ్దాలని తొలగించండి. ప్రశాంతకరమైనవి ప్రిఫర్ చేయండి. ఫోన్లలో, గడియారంలో డోర్ బెల్స్ లో భయంకరమైనవి, నెగిటివ్ ఎనర్జీ కి దారి తీసే శబ్దాలని వుంచద్దు.