ఇలా చేస్తే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు..!

మీ ప్రియుడు లేదా ప్రియురాలు మిమ్మల్ని వదిలి పెట్టి వెళ్లి పోయారా…? తిరిగి మళ్లీ వాళ్లతో ప్రేమ లో ఉండాలి అని అనుకుంటున్నారా..? అయితే సాధారణంగా వివిధ రకాల కారణంగా లవర్స్ విడిపోతారు. నిజంగా కలుసుకోవాలని… తిరిగి మళ్ళీ వాళ్ళ తో ప్రేమ లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా మీరు మీ లవర్ ని తిరిగి మళ్ళీ పొందగలరు.

relationship partners

 

రియాక్షన్ ఇవ్వద్దు:

సోషల్ మీడియాలో వాళ్ళు ఎటువంటి ఫోటోలు అయినా లేదు అంటే ఏదైనా బాగా నచ్చిన ఫొటోల్ని అప్లోడ్ చేసారు అంటే మీరు రియాక్ట్ అవ్వద్దు. వాళ్లు దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అసలు మీరు చూశారా లేదా..? ఇలా వాళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు కలుగుతాయి. ఒకవేళ కనుక మీరు రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మీ కోసం ఎక్కువ ఆలోచిస్తారు.

ఆనందంగా ఉన్నట్లు ఉండండి:

మీరు మీ సోషల్ మీడియా ద్వారా మీరు ఆనందంగా ఉన్న ఫోటోలని… స్నేహితులతో కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నట్లు మీరు పోస్ట్ చేయండి. దీంతో వాళ్ళు బాధపడి.. తిరిగి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటారు.

మీ లుక్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి:

మీరు మరింత అందంగా మారండి. మంచి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలాంటివి ఫాలో అవ్వండి. దీనితో మీరు వాళ్ళకి చాలా అందంగా కనబడి మిమ్మల్ని అనవసరంగా మిస్ చేసుకున్నాను అని బాధపడి తిరిగి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఇలా వాళ్ళని మీరు పట్టించుకోనట్లు ఉంటూ మళ్ళీ వాళ్ళతో ప్రేమలో ఉండచ్చు. కలిసి ఆనందంగా ఉండచ్చు.