మీరు చెప్పేది మీ భర్త వినాలంటే ఇలా చేయండి…!

ఎటువంటి బంధంలోనైనా ఒకరి మాటకు ఇంకొకరు విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే భార్య భర్తల సంబంధం లో కొన్నిసార్లు భర్త భార్య మాటను అంగీకరించరు. మరి అలాంటప్పుడు మీ భర్త మీ మాటను వినాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇక ఆలస్యం చేయకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

husband and wife

భార్య తన అభిప్రాయం లేదా సందేహాన్ని వ్యక్తం చేసే సమయంలో ఎటువంటి కంగారుపడి సమయం మరియు సందర్భం చూడకుండా చెప్పకూడదు. ఎందుకంటే మీ భర్త ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు కాబట్టి. అంతే కాదు ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటున్నప్పుడు, చికాకుగా లేదా కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే అలాంటప్పుడు వారి ఒత్తిడి లేదా కోపం ఇంకా పెరుగుతుంది. దాని వల్ల ఎటువంటి మాటను అంగీకరించరు. కాబట్టి సరైన సమయం లోనే నెమ్మదిగా చెప్పాలి. దానివల్ల మీ భర్త మిమ్మల్ని అంగీకరిస్తారు.

అలానే ఎటువంటి సమస్య వచ్చినా సూటిగా చెప్పండి. అలా కాకుండా మీ బాధను పంచుకోలేక ఏదో ఒకటి చెప్పడం వలన ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. ఎప్పుడైతే నిజాయితీగా మీరు మీ భర్తకి తెలియజేస్తారో అప్పుడే వారికి పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే చెప్పాలనుకునే విషయం వారికి ఏ మాత్రం అర్ధం కాదు అని తెలుసుకోండి. దాంతో మీరు ఎలాంటి సహాయం పొందలేరు.

భార్య చెప్పేది భర్త అంగీకరించాలి అనే ఆలోచనలో పడి భార్య స్వార్థంగా ఉండకూడదు. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత భర్త చెప్పినది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ భార్య చెప్పిందే వినాలి అన్నా అది సరికాదు. కాబట్టి మీరు చెప్పిన తర్వాత మీ భర్త చెప్పింది కూడా అంతే శ్రద్ధగా వినండి. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా వింటారు.