వాస్తు: ఇలాంటి పూలని ఇంట్లో ఉంచితే ఆర్ధిక నష్టం తప్పదు..!

వాస్తు ( Vasthu ) పండితులు ఈ రోజు మనతో ఎంతో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాలను కనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

flower
వాస్తు | Vasthu

 

ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయా..?, మీ ఇంట్లో ఆర్థిక నష్టం ఎక్కువగా కలుగుతోందా..? అయితే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. వీటిని కనుక ఫాలో అయితే ఆర్థిక బాధలు పూర్తిగా దూరం అయిపోతాయి.

సాధారణంగా మన ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ లేదా మరే ఇతర ప్రదేశాల్లో అయినా మనం పూల మొక్కలు కొని పెడతాం. అయితే వీటిని కొనేసి ఇంట్లో పెట్టి కూడా చాలామంది సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో మొక్కలు వాడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆకులు కూడా మాడిపోతాయి.

ఇది అస్సలు మంచిది కాదు. ఇంట్లో ఉండేటప్పుడు పూలు వాడి పోవడం లేదా పూలు నల్లగా అయిపోవడం లాంటివి జరిగితే అస్సలు మంచిది కాదు అని పండితులు అంటున్నారు. ఇలా జరగడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుందని ఆర్ధిక నష్టం కలుగుతుందని అంటున్నారు.