హిందూపూర్ లో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు

-

హిందూపూర్ పట్టణంలో హై అలర్ట్‌. హిందూపూర్ పట్టణంలో 144 సెక్షన్ & సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. మున్సిపల్ ఎలక్షన్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ ఆదేశించారు. హిందూపురంలో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం దిశగా ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు.

hindupur

ఇవాళ మున్సిపల్ కార్యాలయానికి ఎన్నికల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి రానున్నారు. అటు ఇప్పటికీ టిడిపి కౌన్సిలర్లతో క్యాంప్ కొనసాగుతోంది. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన 14 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది వైసీపీ పార్టీ. ఇక ఈ లెక్క ప్రకారం… హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం దిశగా ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మరి ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. ఈ తరుణంలోనే… హిందూపూర్ పట్టణంలో 144 సెక్షన్ & సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news