ఎవరైనా పెళ్ళికి ముందు తప్పక ఈ విషయాలను చర్చించుకోవాలి..!

-

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. పెళ్ళికి ముందు కచ్చితంగా అబ్బాయి అమ్మాయి ఈ విషయాల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. పెళ్లి తర్వాత గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందే క్లారిటీ ఉండాలి. తరచూ గొడవలు రావడానికి కారణం డబ్బు విషయం. ముందుగా ఆదాయం, ఖర్చు, పెట్టుబడులు, అప్పుల గురించి వారితో చెప్పాలి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ముందే మాట్లాడుకోవాలి.

ఇద్దరివి మార్గాలు ఒకటే అయితే మంచిదే లేదంటే ఆలోచించొచ్చు. అలాగే పెళ్లికి ముందు ఇద్దరు కూడా ఇంటి పనుల గురించి మాట్లాడుకోవాలి. వీటిపై క్లారిటీ ఉంటే బావుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. లేదంటే ఒకరిపైనే బరువంతా పడిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కచ్చితంగా మాట్లాడుకుని తీరాలి.

పెళ్లి తర్వాత కుటుంబంతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు..? మీ పెళ్లి పై వారి అభిప్రాయం వంటి వాటి గురించి స్పష్టత తెలుసుకోండి. అలాగే ఇద్దరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని ఎలా అధిగమించాలి, ఒకరినొకరు ఎలా చూసుకోవాలి అనే దాని గురించి కూడా చర్చించుకోవాలి. కలహాలు లేని బంధం అనేది ఉండదు ఒకవేళ అలాంటివి వచ్చిన వాటిని ఎలా అధిగమించాలో చర్చించుకోండి.

ఓపెన్ గా పెళ్లికి ముందే మాట్లాడుకుంటే పెళ్లి తర్వాత ఏ ఇబ్బంది కూడా ఉండవు. కొంతమంది వివాహమైన వెంటనే పిల్లలు కావాలని అనుకుంటారు. గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారా అనే దాని గురించి కూడా చర్చించుకుంటే బెస్ట్. ఇలాంటి సమయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటన్నిటిలోనూ మీకు క్లారిటీ అనేది ఉంటే భవిష్యత్తులో సమస్యలు ఏమి కూడా రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version