జగన్‌ – షర్మిల ఆస్తులపై కోర్టు కీలక ఆదేశాలు..!

-

జగన్‌ – షర్మిల ఆస్తులపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదారాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో జగన్ ఆస్తుల కేసు విచారణ జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో విజయమ్మ, షర్మిలపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. సరస్వతి పవర్ లిమిటెడ్ లో వాటాలపై ఎన్సీఎల్టీ లో పిటీషన్ దాఖలు చేశారు జగన్, ఆయన భార్య భారతి. అయితే.. దీనిపై న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. జగన్‌ వేసిన పిటీషన్‌ పై కౌంటర్‌ చేయాలని తెలిపారు.
దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది.

ys sharmila counter to cm jagan

ఈ తరుణంలోనే… వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది ఎన్సీఎల్టీ. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. తనకు తెలియకుండా తల్లి, సోదరి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు జగన్. పిటీషన్‌లో విజయమ్మ, షర్మిల, జనార్దన్‌ రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు జగన్. షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారన్న జగన్… జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీ పేర్ల మీద ఉన్న 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version