సివిల్స్ అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి శుభవార్త

-

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ మెయిన్స్ పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష నగదు సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం కింద ఈ నగదును అందజేస్తామన్నారు. ఫలితంగా మరింత మంది మెయిన్స్ క్వాలిఫై కోసం స్ఫూర్తిని పొందుతారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం వలన అభ్యర్థులు కేవలం చదువు మీదనే ఫోకస్ పెడతారని ప్రభుత్వం భావిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి సివిల్స్ అభ్యర్థుల సంఖ్య మరింత పెరగాలని, వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సివిల్స్ క్యాండిడేట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి ఆర్థిక ఒత్తిడిని దూరం చేస్తుందని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version