సెప్టెంబర్ 17 నుండి పితృ పక్షం.. ఈ రెండు రోజులపై ప్రభావం..!

-

భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు నుంచి పితృపక్షం మొదలవుతుంది. పితృపక్షం కృష్ణపక్షం అమావాస్య వరకు ఉంటుంది. హిందూ మతంలో పితృ పక్షానికి ప్రాముఖ్యత ఉంది పితృపక్షాన్ని శ్రార్ధ పక్షం, మహాలయ పక్షాలు అని కూడా అంటారు. పూర్వీకులకు శ్రార్థం, తర్పణం వంటివి వదులుతారు. మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే పితృపక్షంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని అంటారు. 17 సెప్టెంబర్ 2024న స్నాన దాన పూర్ణిమ జరిగిన వెంటనే పితృపక్షం మొదలవుతుంది.

పితృపక్షం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంది. బ్రహ్మపురాణం ప్రకారం మనిషి తన పూర్వీకుల్ని పూజించాలి. వాళ్లకు నైవేద్యాలని పెట్టాలి. శ్రార్థం ద్వారా పూర్వీకుల రుణం తీర్చుకోవాలి. సెప్టెంబర్ 18న రెండవ చంద్రగ్రహణం ఈ ఏడాది కలగబోతోంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పితృపక్షం ఆఖరి రోజు అయినటువంటి అక్టోబర్ 2 సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది కూడా భారత దేశంలో కనిపించదు. కాబట్టి రెండు గ్రహాల గురించి ఆలోచించక్కర్లేదు.

పిండదానం అంటే పూర్వీకులకు ఆహారాన్ని దానం చేయడం. పితృపక్షం లో పూర్వికులు కాకులు, ఆవు, కుక్క, బావి, చీమ లేదంటే దేవతల రూపంలో వచ్చి ఆహారం తీసుకుంటారని నమ్ముతారు. పితృపక్షం సమయంలో ఐదు వంతుల ఆహారాన్ని తొలగించాలని నియమం ఉంది. పిండ దాన సమయంలో చనిపోయిన వారి కోసం బార్లీ లేదంటే బియ్యం పిండి ఉండలు కింద చేసి పిండ దానం చేస్తారు. పిండదానం చేయడానికి గయ ప్రదేశం మంచిదని పండితులు చెప్పారు. తర్పణం చేయడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందట అలాగే పూర్వికులు ఆశీస్సులు కుటుంబంపై కలిగి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కచ్చు. పుత్ర సంతానం కూడా కలుగుతుందట

Read more RELATED
Recommended to you

Exit mobile version