ప్రస్తుత రోజుల్లో మనుషులు మర్చిపోతున్న కనీస ఇంగితాలు.. మీరూ ఇలానే చేస్తున్నారా? చెక్ చేసుకోండి.

సెల్ ఫోన్లు వచ్చాక కామన్స్ సెన్స్ మర్చిపోతున్నారు. ఎక్కడో ఉండి మెసేజ్ చేసినవారికి రిప్లై ఇవ్వడంలో బిజీ అయ్యి పక్కనే ఉండి ముఖ్యమైన విషయం చెప్తున్నవాళ్ళని పట్టించుకోవట్లేదు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా తయారైంది. స్మార్ట్ ఫోన్ విషయంలోనే కాదు ఇతర విషయాల్లోనూ కామన్ సెన్స్ ని మర్చిపోతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక విషయం గురించి సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుండగానే, స్మార్ట్ ఫోన్ తీసి, మీరు చెప్పినదానికి తలాడించేవాళ్లకి ఏం కామన్ సెన్స్ ఉన్నట్టు. అలాంటి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవద్దు.

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ రింగైతే, దాన్ని మ్యూట్ లో పెట్టుకోవడమో, బయటకి వెళ్ళి మాట్లాడడమో చెయ్యకుండా సినిమా నడుస్తున్నపుడే ఫోన్ లిఫ్ట్ చేసి పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడేవాళ్ళకి ఏం కామన్ సెన్స్ ఉన్నట్టు.

మీ ఫోన్ లో ఎవరికో ఏదో మెసేజ్ పంపుతున్నారు. అదేంటో చూడాలని తొంగి తొంగి చూడడం ఎంతవరకూ కరెక్ట్. అలా అని కొంచెం కూడా రహస్యం మెయింటైన్ చేయకుండా అవతలి వారికి కనిపించేలా మెసేజ్ చేస్తూ ఏదో పొరపాటున వాళ్ళ కంటబడితే అలా ఎలా చూస్తావు అని అడగడమూ సెన్స్ లేనట్టే. నీకోసం వాళ్ళు అన్ని వైపులకి తల తిప్పకూడదని అనుకోరు కదా.

ఒక పాయింట్ మీద మాట్లాడుతున్నప్పుడు సడెన్ గా అవతలి వారు గొంతు పెంచడం. వాళ్ళ పాయింటే కరెక్ట్ అని ఒప్పించడానికి అరవడం. అవతలి వారికి ఇలానే ఉంటే అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవచ్చు.

మీరొక విషయాన్ని కూలంకషంగా చెబుతున్నప్పుడు మధ్య మధ్యలో ఊరికూరికే డిస్టర్బ్ చేసేవారు..

ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంది. మీరు కూడా ఇలానే చేస్తున్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకుని మీతో ఎవరైనా అలా ప్రవర్తిస్తే మీరెలా ప్రవర్తిస్తారో చెక్ చేసుకోండి.