మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తుందని తెలిపే సంకేతాలు..

ఏ బంధమైనా నిలబడాలంటే నమ్మకం ముఖ్యం. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ దాన్ని నిర్మించడం అసాధ్యం. అందుకే మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. బంధంలో ఉన్నప్పుడు మోసపోతే, అది మానసికంగా బాగా వేధిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు జీవితాలే నాశనం అయిపోతాయి. అందుకే బంధాన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి. ప్రస్తుతం మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తుందని తెలిపే కొన్ని సంకేతాలను ఇక్కడ తెలుసుకుందాం.

 

Signs Your Wife Is Cheating

చిన్న చిన్న చిషయాలను పట్టించుకోకపోవడం

ప్రేమ అనేది చిన్న చిన్న విషయాల ద్వారానే బయటపడుతుంది. కాఫీ చేసి పెట్టడం, పనులు పూర్తయ్యాక గుడ్ బై చెప్పడం, ఒకరి పనుల్లో మరొకరు సాయం చేయడం, మొదలగునవన్నీ మీ బంధం బాగుందని చెబుతుంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకోవడంలో మీ భార్య నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మోసం చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

ప్రైవసీ పెరగడం

అప్పటికప్పుడే సడెన్ గా ఫోన్ పాస్వర్డులు మార్చివేయడం, కాల్ రాగానే సడెన్ గా బయటకి వెళ్ళిపోవడం తరచుగా జరుగుతుండడం, ఫోన్ ని ఎవరూ ముట్టకుండా కాపాడుతూ ఉండడం ఇంకా సెర్చ్ హిస్టరీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండడం మొదలగునవి జరుగుతుంటే మోసం జరిగే అవకాశం ఎక్కువ.

జంటగా గడిపే సమయం తగ్గిపోవడం

వివాహ బంధంలో జంటగా గడిపే సమయం ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. కలిసే అవకాశం ఎక్కువగా లేకపోయినా, కలిసే అవకాశం వచ్చినపుడు మాత్రం క్వాలిటీ సమయం గడపాలి. జంటగా కలిసే సమయం తగ్గిపోతున్నదని మీరు గుర్తించినపుడు మీ బంధానికి బీటలు వారే అవకాశం ఉందని గుర్తించాలి.

జీవనశైలి మారిపోవడం

అంతకుముందు ఉన్న జీవనశైలి పూర్తిగా మారిపోవడం, ఇంట్లో విషయాలపై ఎక్కువగా ఆసక్తి లేకపోవడం, కనీసం ఇద్దరూ కలిసి ఐదు నిమిషాలు మాట్లాడుకుని వారం నెల రోజులకి పైగా అయితే గనక ఆ బంధం అక్కడితో ముగిసినట్టే.