వాస్తు: ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..!

-

సాధారణంగా చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ ఉంటారు. సరిగ్గా వాస్తు కి తగ్గట్టు వస్తువులని పెడితే వాటి వల్ల మనకి తెలియకుండానే లాభాలు కలుగుతాయి. అలానే వాటి వల్ల పాజిటివిటీ వస్తుంది. నెగిటివిటీ మన నుంచి దూరం అయిపోతుంది. అయితే ఈ రోజు నెమలి పించం ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది చూద్దాం..!

నెమలి పింఛం అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. అలానే నెమలి చాలా అందంగా ఉంటుంది. దానికి ప్రత్యేకత కూడా ఎంతో ఎక్కువ ఉంది. చాలామంది పుస్తకాలలో, ఇళ్ళల్లో నెమలి పింఛాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉంటే నెగిటివిటీ తొలగిపోవాలంటే ఈ చిన్న పద్ధతిని అనుసరించాలి.

దీని వల్ల నీకు మంచి కలుగుతుంది. సోమవారం ఎనిమిది చిన్న నెమలి పింఛాలని తీసుకుని వాటిని దారం తో కట్టండి. ఇప్పుడు దానిని దేవుడి దగ్గర విసురుతూ ఓం సోమాయ నమః అని చెప్పండి. ఇలా మీరు దేవుడిని పూజించడం వల్ల మీకు మంచి కలుగుతుంది.

గుళ్లో కూడా నెమలి పించం తో దేవుడిని విసురుతూ ఉంటారు కదా అచ్చం అలానే మీరు సోమవారం నాడు ఇంట్లో దేవుడి దగ్గర చేస్తే మీకు మంచి కలుగుతుంది. ఆర్థికంగా మీరు బాధలు ఎక్కువగా పడుతూ ఉంటే కూడా ఇది మీకు మంచి కలిగేలా చేస్తుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మూడు నెమలి పెంచాలని తీసుకుని మీ డబ్బులు ఉంచే ప్రదేశంలో వాటిని పెట్టండి ఇలా కూడా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది

Read more RELATED
Recommended to you

Latest news