లేవగానే అలసటగా ఉందా..? అయితే ఇలా చేయండి..!

-

కొన్ని కొన్ని సార్లు నిద్ర లేవగానే ఏ పని చేయాలనిపించదు. ఎంతో అలసటగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మన పని తీరుపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఆ రోజు పనులు పూర్తి చేసుకోవడానికి కూడా అవ్వదు. పైగా ఏదైనా పని చేయాలంటే కూడా ఆసక్తి ఉండదు.

నిజంగా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బయట పడటం చాలా కష్టం. మీకు కూడా చాలా సార్లు అనిపించిందా..? అయితే దీనిని తొలగించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని చూసి అనుసరిస్తే అలసట క్షణాల్లో మాయమైపోతుంది.

లేవగానే చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోండి:

మీరు లేవగానే అలసటగా ఉన్నట్లయితే చల్లటి నీళ్లు మొహం మీద కొట్టుకోండి. లేదా చల్లని నీళ్లతో స్నానం చేయండి. చల్లని నీళ్లు ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని మెదడుకు పంపిస్తాయి. తద్వారా మీరు ఫోకస్ పెట్టడానికి వీలవుతుంది. ఇది బాగా పనిచేస్తుంది.

గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగండి:

అలసటగా ఉండడానికి డీహైడ్రేషన్ కూడా కారణం అవ్వచ్చు. నిద్ర వస్తున్నట్లు, సరిగ్గా మూడ్ లేనట్టు ఉన్నట్లయితే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం వేసుకుని తీసుకోండి. ఇలా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దీనితో నెర్వ్ సిస్టం ఫంక్షన్స్ కూడా బాగుంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీరు కంఫర్ట్ గా ఫీలవుతారు.

స్ట్రెచింగ్ చేయండి:

మీరు ఉదయం లేవగానే కాస్త వ్యాయామం చేయడం వల్ల కూడా మీరు అలసట నుంచి బయటపడొచ్చు. కాబట్టి నిద్ర లేవగానే కాసేపు స్ట్రెచింగ్ లాంటివి చేయండి.

అరోమా థెరపీని అనుసరించండి:

అరోమా థెరపీ వల్ల కూడా మీరు అలసట నుంచి బయటపడొచ్చు. బ్రూ కాఫీ స్మెల్, లావెండర్ స్మైల్ ఇలాంటివి ఉదయాన్నే చూడడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news