ఈరోజు మన వాస్తు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. వీటిని పాటిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి వీలు అవుతుంది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసమే ఇప్పుడు చూద్దాం..!
మనం ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యం, ఆదాయం వంటి వాటిపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఏ చిన్న తప్పు చేయకుండా వాస్తు ప్రకారం అనుసరిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి వీలవుతుందని పండితులు చెప్పారు.
ఇంటి పై కప్పు పై సామాన్లని పెట్టడం చాలా మందికి అలవాటు. ఇంట్లో ఉండే పాత సామాన్లు ఇంటి పైకప్పు పై ఉంచుతారు. అయితే ఇలా ఉండడం అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు.
పనికి రాని సామాన్లు, పాత సామాన్లు ఇంటి పై కప్పు పెట్టడం వల్ల నెగిటివ్ ప్రభావం పడుతుందని కుటుంబ సభ్యులు మేధస్సు పై ఇది నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని.. ఇంట్లో ఉండే పాజిటివిటీ పూర్తిగా దూరం అయిపోతుందని.. అదే విధంగా ఇంట్లో అనేక ఇబ్బందులు తీసుకు వస్తుందని పండితులు చెప్పారు.
ఒకవేళ కనుక మీ ఇంట్లో పాత సామాన్లు ఎక్కువ కాలం నుండి ఉంటున్నాయి అంటే వాటిని ఇంటి నుండి బయట పెట్టడం మంచిది. అంతే కాని పనికిరాని సామాన్లని ఇంటి పైకప్పు పై ఉంచడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని కనుక వీలైనంత వరకూ వాటిని తొలగించడం మంచిదని చెప్పారు.