వాస్తు: ఇలా చేస్తే విజయం తధ్యం..!

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది. అదే విధంగా ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. మీ ఇంట్లో శాంతి కలగాలన్నా, ధనం ఉండాలన్నా, దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలగాలన్నా పండితులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాలను పాటించండి. వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా సమస్యలన్నీ దూరం అయిపోతాయి. అయితే మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం కూడా పూర్తిగా తీసేయండి.

పూజ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు వేసి ఆ నీళ్ళని ఇంట్లో ఉండే ప్రతి మూల జల్లండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే ఎండిపోయిన పూలను ఇంట్లో ఉంచితే దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తగ్గాలంటే తినేటప్పుడు ఉత్తరం వైపు కూర్చుని తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

అలాగే ఇంట్లో ఉండే రంగులు కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. పింక్, నీలం, ఆకుపచ్చ లివింగ్ రూమ్ కి చాలా మంచిది. అలానే మాస్టర్ బెడ్ రూమ్ కి పసుపు, ఆరెంజ్ రంగులు వేసుకుంటే మంచి కలుగుతుంది. ఇక పిల్లల గదిలో అయితే లైట్ రంగులు వేస్తే మంచిది. అదే విధంగా ఇంట్లో చేపల తొట్టి పెట్టడం వల్ల కూడా మంచిది. ఎక్వేరియం నిజంగా నెగటివ్ ఎనర్జీని పోగొట్టి, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలానే ఎప్పుడూ కూడా ఇంట్లో చెత్తాచెదారం లేకుండా అందంగా ఉంచుకోవాలి. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. విజయం కూడా మీదే.