వాస్తు: సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో ఈ మార్పులు చెయ్యండి..!

-

ఈ విధంగా మీరు మార్పులు చేయడం వల్ల ఇంటికి అందం మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలు వంటివి ఉండవు. మరి వాస్తు పండితులు చెప్పిన ఈ విషయాలను పాటిస్తే ఏ సమస్య లేకుండా ఉండవచ్చు. వీటి వల్ల ప్రశాంతత ఉంటుంది మరియు సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

ముందుగా ఆర్థిక ఇబ్బందులు పోవడానికి ఇలా చేయండి:

మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే గోడల మీద పువ్వులు లేదా నీళ్లు ఉండే ఫోటోలని పెట్టండి. ముఖ్యంగా ముఖద్వారం, డ్రాయింగ్ రూమ్ గోడల మీద పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా ఉంచడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు వర్క్ చేసే ప్రదేశం లో ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది.

అనుకున్నది సాధించాలంటే ఇలా చెయ్యండి:

శ్రీ కృష్ణుడి ఫోటో పెట్టుకోవడం వల్ల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. వినాయకుడి ఫోటో పెట్టుకోవడం వల్ల అనుకున్నది సాధించడానికి వీలవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు వినాయకుడి ఫోటో పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి మీరు చదువుకునే రూమ్ లో వినాయకుడి ఫోటోని పెట్టండి.

భార్య భర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి:

ఫ్యామిలీ ఫోటోని తూర్పు లేదా ఉత్తరం వైపుని ఉంచండి. దీనితో ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మార్పులు చేసే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి వీలవుతుంది. పైగా సమస్యలు కూడా ఉండవు ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news