సీఎం కేసీఆర్ నోట వెంబడి ఏదైనా హామీ వచ్చిందంటే అది జరిగిపోయినట్టే. ఆయన ఏ హామీ ఇచ్చినా దాన్ని వెంటనే పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు స్పష్టం అయింది. అయితే ఇప్పుడు కేసీఆర్ చెప్పినా.. ఆ పనిమాత్రం పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వానికి బ్యాడ్‌నేమ్ వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
మొన్న గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యల గురించి తెలుసుకొని.. వారి సమస్యల చిట్టాను తనకు పంపాలని కేసీఆర్ ఆదేశించారు. వెంటనే నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
దీంతో తమ సమస్య తీరిపోయినట్టే అని డాక్టర్లు భావించారు. తమ సమస్యల గురించిన వివరాలను సీఎం కేసీఆర్ కు అప్పటికప్పుడు పంపారు జూనియర్ డాక్టర్లు. కానీ ఈరోజు వరకు ఎలాంటి రిప్లై లేదు. దీంతో జూనియర్ డాక్టర్లు మండి పడుతున్నారు. ఈ నెల 26 న బుధవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అదే జరిగితే ప్రతిపక్షాలకు ఈ పాయింట్ బాగా కలిసొస్తుంది. మరి అంత దూరం కేసీఆర్ తెచ్చుకుంటారా చూడాలి.