కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో శనివారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తే సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించామని అన్నారు.
పోలీసులు, టీటీడీ సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. సాధారణ భక్తులు సంతృప్తి స్థాయిలో వాహన సేవలో ఉత్సవమూర్తులను, మూల విరాట్ ని దర్శించుకునే వీలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని.. వాహన సేవలను 15 లక్షల మంది తిలకించాలని తెలిపారు.
గరుడ వాహనం రోజే 3.3 లక్షల మంది వచ్చారని, 26 లక్షల మందికి అన్నప్రసాదాలు, 30 లక్షల లడ్డూలు పంపిణీ చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 26 కోట్లు లభించిందన్నారు టీటీడీ ఈవో. ఇక లడ్డు నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.