పూజామందిరంలో విగ్రహాల ఎత్తు ఏ విధంగా ఉండాలి?


పూజామందిరంలో పూజించే దేవతా మూర్తుల విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి? ఏ పదార్ధాలతో చేసినవై ఉండాలో తెలుసుకుందాం.. దేవుడి విగ్రహాలు ప్రస్తుత కాలంలో కాగితం, రాయి, లోహం, ప్లాస్టిక్, సిమెంట్, గాజు వంటి వివిధ రకాల పదార్థాలతో తయారుచేయబడి ఉంటున్నాయి. ఇంట్లో విగ్రహాలు ఎప్పుడూ రాయితో గాని, లోహంతో చేసినవై ఉండాలి. రాగితో చేసిన విగ్రహాలను వాడొచ్చు. శక్తి కలిగిన వారు ఉత్తమమైన బంగారంతో కానీ, మధ్యమమైన వెండితో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. మిగితా లోహాలు, పదార్థాలతో చేసిన విగ్రహాలు వాడకపోవడమే ఉత్తమం.

విగ్రహాల ఎత్తు ఎప్పుడూ పెద్దవిగా ఉండకూడదు. పూజ గదిలో విగ్రహాల సైజు అంగుష్ఠ ప్రమాణంలో (వేలేడు సైజులో) కానీ, ఒక అడుగు (12 అంగుళాలు) సైజు కన్నా తక్కువగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం చేసే పూజా విధానం వేరు.. ఇలాంటి సందర్భంలో విశేష పూజలను చేసి, తప్పకుండా నిత్య నైవేద్యాలను సమర్పించాలి.
ఇంట్లో ఉండే విగ్రహాలు అంతకన్నా పొడవుగా ఉంటే వాటికి మామూ లుగా ఇంట్లో చేసుకునే పూజ సరిపోదు. మైల సమ యంలో పూజా మందిరం వైపు వెళ్ళకుండా నియమ నిష్టలను పాటించడం ఉత్తమం.

విగ్రహ పరిమాణం ఎంతైనా నిత్యం ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజించాలి. లేనియెడల ఆ పూజ అలంకార ప్రాయంగానే ఉండును. కనీసం యధాశక్తి శ్లోకాన్ని చెప్పి పూజించడం మంచిది, ఎందుచేతనగా దేవుడి విగ్రహాలు అలంకార ప్రాయంగా ఉండకూడదని ధర్మ శాస్త్రం చెబు తోంది.ఎటువంటి విగ్రహాలను పూజ గదిలో జించాలి?