సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కోయకూడదు..?

-

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు. ఇవి చేయొద్దు, ఇలా చేయాలి, ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ పెద్దవాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది. అయితే కొంతమంది వాటిని తెలుసుకోకుండా వాళ్ల అమ్మ చెప్పింది, చేసింది కాబట్టి వీళ్లు అలానే చేశారు, అప్పుడు ఎందుకు అని అడిగే తెలివి ఆ తరం వాళ్లకు లేదు. అదే పద్ధతులు ఇప్పుడు చెప్తుంటే మనం ముందు చేయడం ఆపేసి.. ఎందుకు అలా చేస్తే ఏం అవుతుంది అని ఎదురు ప్రశ్న వేస్తున్నాం.

దానికి వాళ్ల దగ్గర సమాధానం లేకపోవడంతో ఇదంతా సోది, మూఢనమ్మకం అనే భావనకు వచ్చేస్తున్నారు. అందుకే ఆ తరం వాళ్లు పాటించే కొన్ని నియమాల వెనుక ఉన్న అసలైన కారణాలు వెతుకుదాం. అందులో భాగంగా మీరు వినే ఉంటారు.. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అనే ఒక కండీషన్‌. పెద్దోళ్లు చెప్తారు. ఎందుకు కోయొద్దు, కోస్తే ఏం అవుతుందో తెలుసుకుందామా..!

చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదని ఆలోచిస్తే వాటివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు ప్రకృతి పరమైన, శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయనని తెలిసింది. హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం-అశుభం- పండుగ- ఫంక్షన్ సందర్భం ఏదైనా సరే పూల ఉండాల్సిందే.

అయితే సందర్భాల మాట పక్కనపెడితే సూర్యాస్తమానం అయిన తర్వాత పూలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు. పాటిస్తే పోలా అనుకుని పాటించేస్తున్నారు. కానీ చీకటి పడ్డాక పూలు ఎందుకు కోయకూడదన్నది మూఢ నమ్మకమో, చాదస్తమో కాదు దీనికి ప్రకృతిపరమైన కారణాలున్నాయట..
సాయంత్రం చీకటి పడే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో పురుగులు, పాములు చెట్లపై చేరే అవకాశం ఉంది. వెలుగు ఉండదు కాబట్టి చెట్టుపై ఉండే పురుగులు కనిపించకపోవచ్చు. ఆ సమయంలో పూలు కోస్తే విషపురుగుల బారిన పడతామని ఉద్దేశం.

మరోకారణం ఏంటంటే చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైజ్ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు.

సో.. ఇది అసలు కారణం.. పెద్దలు పాటించమని చెప్పే ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది. అది తెలియక అంతా చాదస్తం, మూఢనమ్మకం అనుకోని కొట్టి పారేయడం చేయొద్దని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version