పాలిటిక్స్ చేయడానికి రాలేదు: స్వాతి మాలివాల్

-

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ మణిపూర్ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్పోర్టులో దిగిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నేరుగా సీఎం బైరెన్సింగ్ను కలిసి మాట్లాడుతా.. బాధిత మహిళలకు కౌన్సెలింగ్, పరిహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకుంటా. నేను ఏ రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదు’ అని చెప్పారు.

అయితే.. మణిపూర్‌కు బయలు దేరే ముందు స్వాతి మాలివాల్‌ మాట్లాడుతూ.. ఏది ఏమైనా మణిపూర్ వెళ్లాలనే నిశ్చయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు అందిన ఈ-మెయిల్ షాకింగ్ గా ఉందంటూ దాని స్క్రీన్ షాట్ కూడా ఆమె తన ట్వీట్ కు జోడించారు. ఇది అర్థరహితమన్నారు. హఠాత్తుగా నాకు అనుమతి నిచ్చేందుకు నిరాకరించడమేమిటని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.నన్ను ఆపడానికి వాళ్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. బాధితులకు సాయపడేందుకే నేను వెళ్తున్నాను తప్ప ఇందులో రాజకీయ కోణం లేదని స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శిస్తానని, ఇందుకు తనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మళ్ళీ ఆమె మణిపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను ఎలాంటి సమస్యలూ సృష్టించబోవడంలేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version