చనిపోయిన వారి వస్తువులను ఎందుకు వాడకూడదు..?

-

మనం దెయ్యాలను, ఆత్మలను బలంగా నమ్ముతాం.. చనిపోయిన వారు మళ్లీ పుడతారని కూడా హిందువులు నమ్ముతారు. చనిపోయిన తర్వాత.. ఆ ఇంటి ఎవరైన డెలివరీ అయితే.. వారి రూపంలో చనిపోయిన వాళ్లు మళ్లీ వచ్చారు అనుకుంటాం.. అయితే.. చాలామంది.. మరణించిన వారి వస్తువులను వాడరు..వాటిని భద్రంగా దాచిపెడతారు. లేదా దానం చేస్తారు.. ఎందుకు వాడరు.

ఆత్మ మరో రూపం సంతరించుకునేందుకు లేదా ఊర్ధ్వలోకాలకు చేరుకునేందుకు అనుగుణంగా మరణం తర్వాత రకరకాల క్రతువులు జరుపుతారు. కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. భౌతికంగా చనిపోయిన వ్యక్తి మన మధ్య కనిపించకపోయినా అతడి ఆత్మ ఏదో ఒక రూపంలో ఇక్కడ తిరుగాడుతుందని నమ్మకం. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరాన్ని పొంది పునర్జన్మ తీసుకుంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే చనిపోయిన వ్యక్తి దుస్తులను వేరొకరు ధరించకూడదనేది కూడా ఒక నియమం. ఈ నియమానికి అర్థం ఏంటంటే…

ప్రియమైన వారి మరణం ఒక భయంకరమైన అనుభవం. ఇక వారి దుస్తులు ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు. భరించలేనిదిగా మారవచ్చు. అది వారి ఉనికిని మరోసారి మనకు గుర్తుచేసి బాధిస్తుంది. మరుపుకు రాని వారి జ్ఞాపకాలు మరింత నిరాశకు, నిస్పృహకు కారణం కావచ్చు. అందుకని మరణించిన ప్రియమైన వారి దుస్తులు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది.

మరణించి పరలోకానికి చేరిన వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చెయ్యడం మంచిదని జ్యోతిష్యం అంటోంది. ఇలా దానం చెయ్యడం వల్ల మరణించిన వారి ఆత్మ పురోగమించడానికి, శాంతి పోందేందుకు అవకాశం ఉంటుంది. మరణించిన వారి దుస్తులు దానం చెయ్యడం వల్ల మరణించిన వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కూడా దొరకుతాయి.

చనిపోయిన వారిని తిరిగితిరిగి తలచుకోవడం వారి వస్తువులు వాడుకోవడం, వారి దుస్తులు ధరించడం వారి ఆత్మకు సైతం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుంది. అది అంత మంచిది కాదు. వారి ప్రయాణం ముందుకు సాగి మరు జన్మ వైపు వెళ్లిపోవాలనేది దీని వెనుకున్న మరో నిగూఢ రహస్యం. ఎంత ప్రియమైన వారి వస్తువులైనా, ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. మీరు చనిపోయిన వారిని మర్చిపోతేనే ఆత్మ కూడా ఆ బాధను మర్చిపోయి.. తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది.. మళ్లీ ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది. మీరు వారిని అదేపనిగా తలుచుకుంటూ బాధపడుతుంటే. ఆత్మ ఘోషిస్తుంది. ఇది అంత మంచిది కాదట.!

Read more RELATED
Recommended to you

Latest news