ఇందిరా గాంధీ పథకాన్ని కొనియాడారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలన, విజయాలపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ హయాంలో గరీబి హటావో నినాదం మంచిదేనని.. కానీ ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని ఇప్పుడు సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో రూపాయి నిధి అందిస్తే ప్రజల దగ్గరికి వచ్చేసరికి 15 పైసలే అందివని అన్నారు.
అవినీతి జరుగుతుంటే రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారని.. గరీబి హటావో నినాదాన్ని బిజెపి అమలు చేస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం లో అవినీతికి తావు లేకుండా డిబిటి విధానంలో నేరుగా లబ్ధిదారునికి అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తరువాత అభివృద్దే లక్ష్యమని స్పష్టం చేశారు బండి సంజయ్. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజలలోకి వెళుతున్నామని చెప్పారు.