శ్రీరామనవమి 2021: శ్రీరామనవమి ఎప్పుడు, పూజావేళలు మరియు పాటించాల్సిన పద్దతి..!

శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. అయితే ఈసారి శ్రీ రామ నవమి ఎప్పుడు వచ్చింది..?, ఎలా దేవుడిని ఆరాధించాలి..?, ఉపవాసం చేసే పద్ధతులు ఏమిటి..? ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.

అయితే ఆరోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వివిధ రకాలుగా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఈసారి రామ నవమి ఎప్పుడు వచ్చింది..? అనే విషయానికి వస్తే 2021 శ్రీరామనవమి ఏప్రిల్ 21, మధ్యాహ్నం 12:43 నిమిషాలకి మొదలయింది. అప్పటి నుంచి ఏప్రిల్ 22, 2021 న రాత్రి 12:35 తో ముగుస్తుంది.

అలానే పూజ ఎప్పుడు చెయ్యచ్చు అంటే… ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే మధ్యాహ్నం పూట పూజ చేయాలనుకుంటే ఒంటి గంట నుంచి 1:35 వరకు చేసుకోవచ్చు. ఈ పర్వదినం రోజున భక్తులు తల స్నానం చేసి పూజ గదిలో దేవుడి ఎదుట దీపాన్ని వెలిగిస్తారు.

అలానే ఆ రోజు దేవుళ్ళు దేవతల విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. అలానే ఆ రోజు ఉపవాసం కూడా చాలా మంది పాటిస్తారు. శ్రీ రామునికి హారతి ఇచ్చిన తర్వాత రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు.