జగన్ వ్యతిరేక శిబిరంగా మారుతున్న షర్మిల పార్టీ

-

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్‌ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తుంది..జగన్ తరహాలోనే పోరాటాలు,దీక్షలతో ప్రజల్లోకి వెళ్తున్న షర్మిల తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ దీక్షకు దిగారు. దీక్ష సందర్భంగా సొంత మీడియా సాక్షి పై షర్మిల చేసిన కామెంట్స్ కొత్త చర్చకు కారణమయ్యాయి. ఏపీ సీఎం జగన్,షర్మిల ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలున్నా అవి బహిరంగంగా వ్యక్తపరిచి వైఎస్ అభిమానుల్లో చీలికకు కారణమవుతున్నారా..రానున్న రోజుల్లో షర్మిల పార్టీ జగన్ వ్యతిరేక శిబిరంగా మారనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

తెలంగాణలో రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉండటంతో పాటు..సామాజిక సమీకరణాలు లెక్కలతో తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు వైఎస్ షర్మిల. గతంలో ప్రతిపక్షనేతగా జగన్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు కేంద్రంగా ఉన్న లోటస్ పాండ్ వేదికగానే ప్రస్థానాన్ని మొదలుపెట్టారు వైఎస్ షర్మిల. జగన్ సీఎం అవ్వడానికి రాజకీయంగా కలిసొచ్చిన ఆ లోటస్ పాండ్ నుంచే జగన్ వ్యతిరేక శిబిరాన్ని షర్మిల ప్రొత్సహిస్తున్నారు. జగన్ పొడ గిట్టని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంలో ఉన్న రాజకీయ విభేదాలను ఆ మీడియా వేదికగా పెద్దది చేసి చూపించారు. ఇదంతా షర్మిలకు తెలియకుందా జరుగుతుందా అంటే నమ్మలేని పరిస్థితి.

ఇక షర్మిల పోరాటానికి జగన్ మరో సోదరి..దారుణ హత్యకు గురయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా హాజరయ్యారు. ఇందతా చూస్తూంటే జగన్ వ్యతిరేక శిబిరంగా చెప్పుకునే వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా షర్మిల చెంతకు చేరుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు యాంటీ జగన్ వెదికగానే లోటస్ పాండ్ కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో కూడా షర్మిలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలంగాణాలో పోరాటం చేస్తున్నా ఆమె జగన్ కి వ్యతిరేకమని ఏ మాత్రమైన గట్టి సంకేతాలు కనుక వస్తే ఏపీలో అది వైసీపీకి నష్టం చేస్తుంది. ఇవన్ని తెలిసి షర్మిల ఆస్థాయి దూకుడు ప్రదర్శించటం ఆశ్చర్యంగా ఉంది.

మరో వైపు షర్మిలను జగన్ దూరం చేసుకోకుండా ఉండాల్సింది అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇక తొలిరోజునుంచే టీఆర్ఎస్ పైనే ఆమె బాణం ఎక్కుపెట్టింది. ఖమ్మం సభలో కెసీఆర్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కేసీఆర్,జగన్ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతీసేలా ఉంది అన్న చర్చ సైతం వైసీపీ,టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుంది. మరీ అన్న,చెల్లెలు విభేదాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి..వైఎస్ ఇంటి పరువు రచ్చకీడుస్తారా అన్న ఆందోళన సైతం వైఎస్ అభిమానుల్లో వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news