శ్రీశైలంలో 12 నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

-

 తాత్కాలికంగా పలుసేవల నిలిపివేత

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో పలు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పులను గమనించి భక్తులు శ్రీశైలం యాత్రకు వెళ్లాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news