జూలై 16న చంద్రగ్రహణం. ఈ రోజు ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పింది? గ్రహణం సమయంలో ఏం జరుగుతుంది వంటి విషయాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం…
సాధారణంగా చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యుడి మధ్య భూమి వస్తుంది. అప్పుడు చంద్రడు భూమి మీద ఉన్నవారికి కనిపించడు. ఈ గ్రహణాన్ని చంద్ర గ్రహణం అంటారు. చంద్రడు కాంతిలో ఔషధ గుణాలు ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపై కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శా్రస్త్రం చెప్పింది. దాని వల్ల గర్భస్థ శిశువుకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ముందుచూపుతో పెద్దలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. ప్రకృతిలో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది. ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది.
ఇక గ్రహణ సమయంలో ఎక్కువగా మనం వినే వార్తలు దేవాలయాలు మూసివేత, నదులు, సముద్రాలలో జపం, స్నానం వంటి పుణ్యకార్యాలు ఆచరించడం. సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో శాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి. ఇంటిలో గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేస్తే మంచిది. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనం పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను. ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితాలు వస్తాయని పండితుల అనుభవం. గ్రహణ భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .
సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణసమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. దర్భలతో శుద్ధి ఎలా జరుగును గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి. ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని
అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినట్లయితే అవి బూజు పట్టకుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగం పరిశోధించి తెలిపిన విషయం. అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం. గ్రహణం రోజు శుచితో దైవనామస్మరణ, స్నానం, దానం చేయండి, మంచి ఫలితాలను పొందండి.
– కేశవ