ఎలుకలను దైవంగా కొలిచే ఆలయం.. అక్కడ నైవేద్యంగా మద్యపానం ఇస్తారట..!

-

మన దేశంలో.. ఎన్నో ఆలయాలు.. వాటికి మరెన్నో చరిత్రలు.. అయితే కొన్ని టెంపుల్స్ లో పాటించే ఆచారాలు, పెట్టే నైవేద్యాలు.. భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి వాటి గురించి మనం ఇంతకుముందు కూడా.. ఓ సారి.. చర్చించుకున్నాం.. ఇప్పుడు ఇంకొన్ని వింత ఆలయాల గురించి మాట్లాడుకుందాం.. ఎలుకలను పూజించే భక్తులు ఉన్నారు.. ఇంకో ఆలయంలో అయితే.. నైవేద్యంగా మద్యపానం ఇస్తారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో.. అవి ఎక్కడున్నాయో చూద్దామా..!

1. రాట్ టెంపుల్ రాజస్థాన్..

రాజస్థాన్ లోని బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే… దేష్నాక్‌లోని కార్నీ మాత టెంపుల్. ఈ ఆలయంలో ఎలుకలను పూజిస్తారు.. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను… ఎలుకల్లో వీళ్లు చూసుకుంటారు. అందుకే ఈ ఆలయంలో… ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు… తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. అసలు ఎలుకలకు ఎలా పూజలు చేస్తారో.. అవి ఆ ఆలయంలో ఎలా తిరుగుతాయో. మనషులు వాటిని చూసి భయపడరా..? మన ఇంట్లో ఒక్క ఎలుక ఉంటేనే.. చంపేవరకూ వదలం.. అలాంటిది ఆలయంలో ఎలుకల మయం ఉంటే.. పూజలు, నైవేద్యాలు.. కచ్చితంగా అందరూ ఇది చూడాల్సిన టెంపులే.. అందుకే టూరిస్టులు వెళ్లి.. వీడియోలు తీసుకుంటారు.

2. హడింబ టెంపుల్..

మనాలీలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్థుల ఈ ఆలయం… పగోడా ఆకారంలో ఉండి అదరిని ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలయం లేదట. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి… ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుల్లు రాజులు… హడింబా దేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్లు.
 ఇక్కడ అమ్మవారి కంటే.. ఆలయ నిర్మాణశైలి వల్లే ఈ ఆలయం ఫేమస్ అయింది.

3. కాల భైరవనాథ్ టెంపుల్

గుళ్లో ప్రసాదం అంటే.. పులిహోరా, చక్రపొంగళి లాంటివి ఉంటాయి.. కానీ ఆ టెంపుల్ లో.. మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. అసలు ఆలయాల్లో మద్యం తాగి వస్తేనే పంపించరు.. మరి అలాంటింది ఆ ఆలయంలో ఏకంగా మద్యాన్నే ప్రసాదంగా ఎందుకు ఇస్తున్నారు. వారణాసిలో… శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ నైవేద్యం సహా… దేవుడికి సమర్పించే ప్రతీదాన్నీ… మద్యంతోనే తయారుచేస్తారు… అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మద్యమే అమ్ముతారు. ఈ టెంపుల్ కూడా కచ్చితంగా వెళ్లాల్సిందే..

4. చైనా కాళీ టెంపూల్..

కోల్‌కతాలోని తాంగ్రాలో… చైనాటౌన్ ఉంది. ఇక్కడ చైనీయులే ఉంటారని.. ఆ పేరు పెట్టారట. వాళ్లు కాళీమాతను పూజిస్తారు. అందుకే… ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. చైనీయులు… నూడుల్స్, చాప్‌సుయ్ లాంటివి నైవేద్యంగా పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలన్నీ పాటిస్తారు.

5. భ్రమర టెంపుల్, రాజస్థాన్..

బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు లేవు.. కేవలం రాజస్థాన్ లోని పుష్కర్ లోనే బ్రహ్మ ఆలయం ఉంది. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారట.. ఔరంగజేబు… మన దేశాన్ని పాలించిన సమయంలో… చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు.. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చెయ్యకపోవడం ఆశ్చర్యమే.. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు… భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన… వెండి నాణేలు అమర్చారు. ఆ టెంపుల్ ఉండే వాతావరణం చాలా బాగుంటుందని భక్తులు అంటుంటారు.

6. కాడు మల్లేశ్వర టెంపుల్

బెంగళూరులో 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం అందరికి ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా… ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచీ… ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచీ వచ్చే నీరు… శివలింగం పై పడి… ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో ఎవరికీ తెలియలేదు. ఈ నీరే… ఇక్కడున్న విషభవతి నదికి జీవ జలం అని నమ్ముతారు.
ఇలాంటి విచిత్రమైన.. విశేషమైన ఆలయాలు మన దేశంలో ఇంకా ఉన్నాయి.. వాటి గురించి మళ్లీ మాట్లాడుకుందాం..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news