భక్తి : ఇంటి నుండి బయటకి వెళ్ళేటప్పుడు వీటిని చూస్తే శుభ ఫలితాలు ..!

వివిధ పనుల మీద చాలా మంది ఇంటి నుండి బయటకు వెళ్తారు. ఆఫీస్ పనులు మొదలు ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి. అయితే మీరు వెళ్లే పనులు దిగ్విజయంగా జరగాలని శుభ ఫలితాలు కలగాలని మీరు అనుకుంటే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. మరి ఇక వాటి కోసం చూస్తే..

ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా వీటిని చూడండి. దీనితో కొన్ని పనులు ఆటంకం లేకుండా పూర్తి అయిపోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు నిండుగా నీళ్ళు ఉండే వాటిని చూస్తే మంచిది. అదే విధంగా ఇంటి నుండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళినప్పుడు పాలుని చూస్తే మంచిది.

పెళ్లి, ప్రయాణం వంటి వాటి కోసం వెళ్లేటప్పుడు దూడకి పాలిచ్చే ఆవును చూస్తే శుభ ఫలితాలు కనపడతాయి అని పండితులు చెప్తున్నారు. ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా వాతావరణ మార్పులు లేకుండా తుమ్ము వస్తే అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

అలానే ఒక తుమ్ము కంటే ఎక్కువ తుమ్ములు వచ్చినప్పుడు వెళ్తే పనిలో ఆటంకం లేకుండా పనులు త్వరగా పూర్తి అయిపోతాయి. గుడిగంటలు వంటివి వినిపించినా సరే మీరు చేసే పనిలో సక్సెస్ ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అదే విధంగా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పూలని కానీ పూలదండలుని కానీ చూస్తే శుభం కలుగుతుంది. తమలపాకులను చూడడం వల్ల కూడా మంచిది. చేపలు లేదా ఏనుగుని ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చూస్తే పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.