వెండి ప్రియులకు భారీ షాక్… ఇవాళ బంగారం ధర తెలుసా?

న్యూఢిల్లీ: బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి మాత్రం షాక్ ఇచ్చింది. కేజీ వెండిపై ఒకే రూ.4,300 పెరిగింది. నిన్నటితో పోల్చితే ఇవాళ బంగారం కూడా పెరిగింది. కాకపోతే పది గ్రాముల బంగారంపై రూ. 10 మాత్రమే పెరిగింది. పెరిగిన ధరతో తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,380 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,260గా ఉంది.

బంగారం-వెండి
బంగారం-వెండి

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,380 కాగా రూ. 22క్యారెట్ల బంగారం రూ. 45,260గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.

ఇక వెండి ప్రియులకు మాత్రం భారీ షాక్ తగిలింది. ఒక్కసారిగా కేజీపై 4 వేల 300 రూపాయలు పెరిగింది. మంగళవారం కేజీ వెండి రూ. 67,500 ఉండగా ఇవాళ కేజీ వెండి రూ. 71,800గా విక్రయాలు జరుగుతున్నాయి.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…