తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎంత మంది భక్తులు వచ్చారంటే..?

-

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కరోనా వల్ల రెండేళ్లుగా నిరాడంబరంగా జరిగిన ఈ ఉత్సవాలు ఈ ఏడాది రెట్టింపు వైభవంతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దాదాపు ఏడున్నర లక్షల మంది భక్తులు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారని చెప్పారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి టీటీడీ ఛైర్మన్, ఈవో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ రోజు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కొనసాగిస్తామని ప్రకటించారు. వాహన సేవల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ సేవ రోజు భక్తులకు సంతృప్త స్థాయిలో దర్శనం కల్పించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version