వాస్తు: ఇంట్లో పాజిటివిటీ ఉండాలంటే బాత్ రూమ్స్ లో ఈ మార్పులు చెయ్యండి..!

ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..?, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తోందా..? అయితే తప్పకుండా వాస్తు పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. ఈ విధంగా కనుక పాటించారు అంటే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నిజంగా వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల చాలా మంచి కలుగుతుంది.

మనం లివింగ్ రూమ్, బెడ్ రూమ్, వాష్ రూమ్, డైనింగ్ రూమ్, బాత్ రూమ్ ఇలా అన్నిటిలో పాటించాలి. అయితే ఈ రోజు బాత్రూమ్స్ లో ఎలాంటి మార్పులు చేయాలి అనేది చూద్దాం. బాత్రూం లో కూడా వాస్తు పాటించాలి. ఇంట్లో నెగిటివ్ ఉండకుండా ఉండాలంటే బాత్రూంలో నుండి మంచి సువాసన వచ్చేలా చూడండి. అలానే బాత్రూంని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనితో అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

అదే విధంగా బాత్రూం లో అద్దం తూర్పు వైపు ఉంటే మంచిది. ఒకవేళ కనుక మీరు తప్పు దిక్కులో అద్దాన్ని పెట్టి ఉంటే తప్పక మార్చండి. అలానే వాటర్ క్లోసెట్ ఎప్పుడూ కూడా ఉత్తర, దక్షిణం వైపు ఉండాలి అలానే కుళాయిలు ఎప్పుడూ కూడా ఈశాన్య, వాయువ్యం వైపు ఉండాలి. ఇలా ఈ విధంగా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీంతో సమస్యలు కూడా మీరు చెక్ పెట్టొచ్చు.