వాస్తుని పాటించడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల మంచి కలుగుతుందని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి తెలుసు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం అవడానికి వాస్తు బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ రోజు మనతో పండితులు కొన్ని ముఖ్యమైన చిట్కాలని పంచుకున్నారు.
వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా మీరు సమస్యల నుండి బయట పడవచ్చు అని పండితులు అన్నారు. అయితే మరి ఆ వాస్తు చిట్కాల గురించి ఎలాంటి ఆలస్యం లేకుండా వాటి గురించి చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే ఖర్చు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
తూర్పు వైపు వుండే గచ్చు రంగుని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తూర్పు వైపు ఆకు పచ్చ గచ్చు వేస్తే మంచిది. కాబట్టి తూర్పు వైపు ఉండే గచ్చుకి ఆకుపచ్చ మార్బుల్ వేయించుకోండి. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ మార్పు చేస్తే చాలా మంచి కలుగుతుంది.
అదే విధంగా ఇంట్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ రంగు మార్బుల్ ని తూర్పు వైపు వేస్తె ఇంట్లో ఉండే కొడుకుకి కూడా మంచి కలుగుతుంది అదే విధంగా ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. ఈ చిట్కాలను మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా సమస్య నుండి బయట పడవచ్చు అలాగే ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండచ్చు.