ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి ఆ 8 సీట్లు కూడా వచ్చేవి కాదు అన్నారు. రాస్ట్రంలో కాంగ్రెస్ కి బీజేపీ ప్రత్యామ్నాయం అని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు.
గత నాలుగు నెలల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్యకర్తలు కష్టపడ్డారు. రెండు నెలల్లో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని ప్రజా పోరాటాలకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై చాలా అసంతృప్తి గా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక రకాలుగా ముఖ్యమంత్రి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినా కూడా బీజేపీ విజయం సాధించింది. విజయానికి తానేమి అతి ఉత్సాహం చూపించడం లేదు. మా బాధ్యత పెరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి.